Kasthuri: నాగార్జున అంటే పిచ్చి ఇష్టం.. దానికి కూడా రెడీ..
Kasthuri: ప్రస్తుతం ఉన్న జనరేషన్ వాళ్ళకి కస్తూరి గురించి తెలియకపోవచ్చు. కానీ భారతీయుడు చిత్రంలో హీరోయిన్ అంటే మాత్రం కచ్చితంగా ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రేమికుడు చిత్రం హిట్ ప్రతి ఒక్కరు డైరెక్టర్ శంకర్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆయన చిత్రంలో అవకాశం వస్తే బాగుంటుందని ఆశపడేవారు. కాగా భారతీయుడు నుంచి నాకు కాల్ వస్తుందని కలలో కూడా ఊహించలేదు. శంకర్ డైరెక్షన్, రెహమాన్ సంగీతం పైగా కమలహాసన్ హీరో చిత్రంలో అవకాశం వస్తే ఎవరైనా ఎగిరిగంతేస్తారు.
ఇక ఈ చిత్రంతో నాకు అదృష్టం మరింత తలుపు తట్టింది. తెలుగులో అన్నమయ్యలాంటి చిత్రం నేను ఊహించలేదు. నేను స్కూల్లో చదువుకున్న రోజుల్లో నాగార్జున గారంటే చచ్చేంత ఇష్టపడేదాన్ని అప్పట్లోనే ఒకరోజు నాగార్జుననే కలిశాను. ఇప్పుడుకూడా ఏ షర్టు వేసుకున్నాడో నాకు గుర్తుంది. ఆయన నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చాడు. ఆ టచ్ నేను ఏమి తాకకుండా స్కూల్ కి వెళ్లే మా ఫ్రెండ్స్ అందరికీ చూపించాను. అప్పటినుంచి నాగార్జున టచ్ చేసిన చెయ్ అంటూ అంతా టచ్ చేసేవారు.
నాగార్జునగారంటే నాకు ఇప్పటికీ ఇష్టమే అని తెలిపింది. ఆయన పై ఉన్న అభిమానం ఎప్పటికీ పోదాంటూ.. అన్నమయ్య చిత్రం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను అంటూ వెల్లడించింది. ఇక ఈ చిత్రం చేస్తున్నప్పుడు ఆయన చాలా సాఫ్ట్ గా అందరినీ అల్లుకుపోయేవారు అంటూ చెప్పగా ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు తెగ వైరల్ అవుతున్నాయి. దాంతో ఏంటి కస్తూరి (Heroine Kasthuri) నీకు నాగ్ ఇంత ఇష్టమా.. మన్మధుడు అంటే ఇష్టపడని వారైనా ఎవరుంటారు అంటూ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.