మొన్ననే పెళ్లి అప్పుడే విడాకులు.. నయనతారతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన భర్త..
Nayanthara : ఈ పేరుకి ప్రత్యేక ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఎంతో మంది స్టార్ హీరోలతో డైరెక్టర్లతో పని చేసి మంచి పేరు సంపాదించుకుంది నయనతార. అంతే కాకుండా ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి సక్సెస్ పొందింది. గతఏడాది తమిళ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, నటుడు అయిన విగ్నేష్ ని పెళ్లి చేసుకుంది. ఆ తరువాత సరోగసీ ద్వారా ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇంకా ఇలా చేయటం వాళ్ళ వారికి చాలానే ఇబ్బందులు వచ్చాయి.
సరోగసీ ద్వారా పిల్లలని కన్నందుకు వారు కోర్ట్ దాకా వెల్లాసి వచ్చింది. పిల్లలు పుట్టిన తరువాత కొంత కాలం బ్రేక్ తీసుకుని నయనతార మల్లి సినిమాలు ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్ లో తన కెరీర్ ను అద్భుతంగా రాణిస్తూ బాగానే డబ్బులు కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం నయనతార గురించిన ఒక విషయం నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే నయనతార విగ్నేష్ విడాకులు తీసుకోబోతున్నారు అని. అసలు ఏంటి విషయం.?
ఎల్లప్పుడు సోషల్ మీడియా లో ఆక్టివ్ గా ఉండే నయనతార తన భర్త విగ్నేష్ ను అన్‌ఫాలో కొట్టింది. దీనితో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతుంది. ఈ విషయం పై స్పందిస్తూ విగ్నేష్ అది కేవలం ఒక గ్లిచ్ అని ఏదో టెక్నికల్ సమస్య అని చెప్పాడు. కానీ ఫాన్స్ మాత్రం ఈ విషయం నమ్మటం లేదు, వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరుగుతున్నాయి అని చర్చించుకుంటున్నారు.