Megastar Chiranjeevi: మీరు గమనించారా.? మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు అలాంటి పాత్రలో ఎందుకు నటించలేదో.. అసలు కారణం ఇదేనట.
Megastar Chiranjeevi: తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గారికి ఉన్న పాపులాటీ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. తన సినీ కెరీర్లో ఎన్నో చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వగా మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. ఫ్లాప్ చిత్రాలలో కూడా సూపర్ క్రేజ్ దక్కించుకున్న ఏకైక హీరోగా చిరంజీవికే ఆ ఘనత దక్కుతుంది. సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అందులో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే చిరుత తన సినీ జీవితంలో ఎన్నో
వైవిధ్యమైన పాత్రలు పోషించగా ఎక్కడా కూడా రోగిష్టిగా జబ్బు చేసిన పాత్రలో మంచం మీద పడి ఉండే పాత్రలు ఏవి చేయలేదు. ఇక ఈ విషయం గురించే ప్రస్తుతం నెట్టింట ఒక వార్త వైరల్ గా మారింది. అలా చేయడానికి కారణం ఏంటి.? చిరుకి ఎందరో డైరెక్టర్లు అలాంటి క్యారెక్టర్ ని ఎంపిక చేశారట. కానీ మొదటి నుంచి తన తల్లి గారికి చిరంజీవి గారు ఇలాంటి పాత్రలలో నటించడం ఇష్టం లేదట. ఆ కారణంగానే తన తల్లి కోరిక నెరవేర్చడం కోసం చిరంజీవి అలాంటి పాత్రలు ఎంపిక
చేయడం ఆపేశాడట. ఎన్నో పాత్రలలో ఇట్టే అవలీలగా నటించి మెప్పించే చిరు తన తల్లి కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఇది తెలిసిన ఆయన అభిమానులు అవాక్కైపోతున్నారు. అందుకే బాసు నువ్వు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగావు అంటూ ఆకాశానికి ఎత్తిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర అనే చిత్రం యొక్క షూటింగ్ పనులలో చాలా బిజీ బిజీగా ఉన్నాడు. ఇక ఈ చిత్రంలో చిరు (Megastar Chiranjeevi) సరసన జోడిగా త్రిష నటించబోతుంది.