Priyamani: వాష్ రూమ్ లు లేక బహిరంగంగానే చేయాల్సి వచ్చిందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రియమణి..
Priyamani: ప్రస్తుతం ప్రియమణి తన రెండవ ఇన్నింగ్స్ మొదటి ఇన్నింగ్స్ కంటే సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఒకానొకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో,పలు వెబ్ సిరీస్ లలో, స్టార్ హీరోల సరసన కీలక పాత్రలు పోషిస్తూ తన సత్తా నిరూపించుకుంటుంది. జవాన్ లో కీలక పాత్ర పోషించిన సంగతి మనందరికీ తెలుసు. ఇటీవలి కాలంలో ఆర్టికల్ 370, భామ కలాపం 2 చిత్రాల్లో నటించింది.
ప్రస్తుతం ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టి నట్లయితే తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఉత్తమ నటిగా చాలా అవార్డులు దక్కించుకుంది. అందులో కీలకంగా జాతీయ అవార్డు సైతం దక్కించుకుంది. పరుత్తివీరన్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వరించింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి చిత్రం యొక్క షూటింగ్ సమయంలో తను ఎదుర్కొన్న అనుభవాలను షేర్ చేసుకుంది. పరుత్తివీరన్ షూటింగ్ మధురైలోని పలు గ్రామాల్లో షూటింగ్ నిర్వహించగా..
ఆ సమయంలో అక్కడ తను ఎంతగానో ఇబ్బంది పడ్డట్టు ఆనాటి రోజులని గుర్తు చేసింది. షూటింగ్ జరిగే సమయంలో క్యారవాన్ తరహా సదుపాయాలు లేవని కనీసం వాష్రూమ్స్ కూడా ఉండేవి కాదని తెలిపింది. పల్లెటూర్లలో ఉండే వాష్రూమ్స్ ని వినియోగించాల్సి వచ్చేవి. ఇక అవి లేని సమయంలో ఓపెన్ గా బయటకి బహిరంగంగానే వెళ్లి వచ్చేదంటూ ప్రియమని పేర్కొంది. దాంతో ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంతోనే కార్తీ హీరోగా ఎంట్రీ ఇవ్వగా ప్రియమణి (Priyamani) హీరోయిన్ గా నటించింది.