Actress Mrunal: జూమ్ చేసి ఆ పార్ట్స్ ను ట్రోల్ చేస్తున్నారంటూ ఆవేదన చెందుతున్న హాయ్ నాన్న బ్యూటీ..
Actress Mrunal: తెలుగు చిత్ర పరిశ్రమంలో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పేరు మృనాల్ ఠాకూర్. టాలీవుడ్లో కేవలం రెండే చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా కొనసాగుతుంది ఈ భామ. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా రానిస్తున్నది. ఈ భామ పేరుకే బాలీవుడ్ బ్యూటీ కానీ టాలీవుడ్ లోనే విపరీతమైన క్రేజ్ మూటగట్టుకున్నది. ఇక్కడి వరకు అంతా బానే ఉంది. తన అద్భుతమైన నటనతో అందరినీ అలరిస్తూ ఆకట్టుకుంటుంది. కానీ నెట్టింట ఈ అమ్మడు ఎదుర్కొంటున్న చేదు అనుభవాల గురించి ఆవేదన చెందుతున్నది.
గతంలో సైతం బాడీ షేమింగ్ ట్రోల్స్ పై స్పందించిన విషయం చూసాం. తాను అస్సలు హాట్ గా లేనని, పల్లెటూరి పిల్లనని, వెయిట్ తగ్గాలని చెప్పారట. బాడీ షేమింగ్ కామెంట్స్ ని సైతం ఎదుర్కొన్నాను అంటూ వెల్లడించింది. ఎన్నో కష్టాలు పడితే కానీ మృణాల్ ఈ స్థాయికి ఎదగలేదు. డాక్టర్ కావాలనుకున్న మృణాల్ యాక్టర్ అయిందన్న విషయం మనకు తెలిసిందే. మొదట టీవీ నటిగా కెరియర్ ప్రారంభించి ఇక్కడ కష్టంగా మారిపోయేదట. సినిమాలో అవకాశం దక్కేవి కాదట.. టీవీ నటి అని ఎవరు అవకాశం ఇవ్వలేకపోయారు.
దాంతో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక అవకాశం రావడంతో చిన్నచిన్నగా ఇలా పెద్ద అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా మారిపోయింది. ఇటీవల హాయ్ నాన్న చిత్రంతో భారీ విజయాన్ని కైవసం చేసుకున్న మృణాల్ విజయ్ దేవరకొండ తో కలిసి ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం ఏప్రిల్ 5వ తారీఖున విడుదల కానున్నది. ఇదే కాకుండా మృణాల్ (Actress Mrunal) ప్రభాస్ కల్కి 2898AD లో ఓ ప్రముఖ పాత్ర చేయబోతున్నారు.