Jyothika: నీ భర్త అంటే నాకు పిచ్చి ఓ రోజు పంపిస్తావా అంటూ కామెంట్ దానికి జ్యోతిక రిప్లై..

Jyothika: నీ భర్త అంటే నాకు పిచ్చి ఓ రోజు పంపిస్తావా అంటూ కామెంట్ దానికి జ్యోతిక రిప్లై..

Jyothika: సోషల్ మీడియా వచ్చాక చాలామందికి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకరకంగా ఇది కొంత మంచైనప్పటికీ మరొక రకంగా కాస్త ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. డైరెక్ట్ గా అభిమానులు హీరో, హీరోయిన్ల నుంచి కచ్చితంగా అడిగిమరీ తీసుకుంటారు. ఓపెన్ గా కామెంట్ చేస్తుంటారు. వాళ్లకి అనుగుణంగానే హీరో హీరోయిన్లు కూడా అప్పుడప్పుడు చిట్ చాట్ చేస్తూ తన అభిమానుల మనసులో ఉన్న కోరికలు ఏంటో అడిగి తెలుసుకుంటారు.

అందులో భాగంగానే ప్రస్తుతం నెట్టింట హీరో సూర్య అభిమాని చేసిన ఒక కామెంట్ గురించి నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంది. సూర్య జ్యోతిక లు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ వివాహ బంధాన్ని ముందుకి తీసుకు వెళుతున్నారు. వివాహము అనంతరం జ్యోతిక (Jyothika) సినిమాలకి దూరంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి అదరగొడుతుందని చెప్పాలి. కాగా ఇటీవల ఆమె నటించిన సైతాన్

surya-jyothika

చిత్రం సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భంగా జ్యోతిక చిత్ర బృందానికి కంగ్రాట్యులేషన్స్ అంటూ కృతజ్ఞతలు తెలిపే ట్వీట్ చేసింది. ఆ ట్విట్ లో సూర్య అభిమాని జ్యోతికకు మెసేజ్ చేసింది. మీ భర్త అంటే నాకు చాలా ఇష్టం ఒకరోజు అప్పుగా ఇస్తారా అంటూ ఓపెన్ గాని అడగ్గా అందుకు జ్యోతిక కూడా అదిరిపోయే రిప్లై ఇచ్చింది. నో నో అది ఎప్పటికీ జరగని పని అంటూ ఫన్నీగా సమాధానం పెట్టింది. దాంతో నెట్టింట ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ లో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

Ganesh Reddy