Star Actress: దాని రుచి చూపించడానికి నా భర్త అర్ధరాత్రి నిద్ర లేపాడంటూ స్టార్ నటి షాకింగ్ కామెంట్స్..
Star Actress: నిర్మాత రవిచంద్రన్ నటి మహాలక్ష్మిని ప్రేమించి మరి వివాహం చేసుకున్నాడు. ప్రేమ పెళ్లితో ఒకటైన ఈ జంటపై నిత్యం ఏదో ఒక రకమైన ట్రోల్స్ వస్తూనే ఉంటాయి. అలా ఎన్ని వచ్చినప్పటికీ ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా వీళ్ళ జీవితం హ్యాపీగా అన్యోన్యంగా కొనసాగిస్తున్నారు. మహాలక్ష్మి తన భర్తతో కలిసి ఫోటోలు రీల్స్ చేస్తే చాలా సంతోషంగా తన జీవితాన్ని గడుపుతుంది. అయితే గతేడాది రవీందర్ ఓ కేసులో అరెస్టయి జైలు పాలైన విషయం తెలిసిందే.ఒక వ్యక్తి నుండి 15 కోట్లు మోసం చేశాడంటూ రవీందర్ ని అరెస్టు చేయగా
బెయిల్ పై బయటకు వచ్చాడు. కాగా నిన్న రాత్రి మహాలక్ష్మి (Star Actress) తన పుట్టినరోజును ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. అందులో భాగంగా మహాలక్ష్మి రవీందర్ గురించి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ పుట్టినరోజు నాకెంతో అంతులేని ప్రేమ భావోద్వేగంతో నిండిపోయింది. నా భర్త నన్ను అర్థరాత్రి నిద్రలేపి మరి ఆ రుచికరమైన కేక్ కట్ చేపించి నాకు తినిపించాడు. ఆ కేక్ చూసి నేను షాక్ అయ్యానని ఒక్కసారిగా పట్టలేనంత ఏడుపు వచ్చేసింది. రవీందర్ మనసు ఎంతో మంచిది. ఆయన నా భర్తగా రావడం నా అదృష్టం.
నేను ఎప్పటికీ అతన్ని ప్రేమిస్తూనే ఉంటాను అంటూ తెలియజేసింది. అలాగే మహాలక్ష్మి మదర్, బ్రదర్ తనను మానసిక వికలాంగుల ఆశ్రమానికి తీసుకెళ్లగా అందులో ఉన్న వారందరికీ ఆహారం అందించామని అందుకు వారందరికీ కృతజ్ఞతలు అంటూ తెలియపరచింది. ఇక బంగ్లాదేశ్ నుంచి తన తండ్రి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారని.. తన మామయ్య, మిత్రులు అందరూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో తనపై చూపిస్తున్న ఈ ప్రేమకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు అంటూ నటి మహాలక్ష్మి తెలియజేసింది.