Anushka Shetty: అదే జరిగుంటే అనుష్క ఎప్పుడో ఆ స్టార్ డైరెక్టర్ కోడలు అయ్యేది.. కానీ..

Anushka Shetty: అదే జరిగుంటే అనుష్క ఎప్పుడో ఆ స్టార్ డైరెక్టర్ కోడలు అయ్యేది.. కానీ..

Anushka Shetty: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరుగాంచిన అనుష్క శెట్టి అంటే అందరికీ పరిచయమే. కుర్ర హీరోయిన్లకు దీటుగా దశాబ్దాల కాలం నుండి ఇప్పటికి ఇండస్ట్రీలో రాణిస్తూ తన సత్తా చాటుకుంటుంది ఈ కన్నడ కుట్టి. ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఇక అనుష్క పేరెత్తగానే మొదటగా మనకి వినిపించే పేరు ప్రభాస్. వీళ్ళిద్దరి మధ్యల ఉన్న రిలేషన్ నడిచిన పుకార్ల గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.

ఇక వాటిని సీరియస్ గా తీసుకున్న వీరు ఇరువురు మా మధ్య ఏమీ లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని వెల్లడించినప్పటికీ.. వీళ్ళ అభిమానులు మాత్రం ఆ మాటలను కొట్టి పడేశారు. అయితే ప్రస్తుతం అనుష్క గురించి ఒక వార్త వైరల్ అవుతుంది . ఒకవేళ అదే జరిగింటే ఆ స్టార్ డైరెక్టర్ ఇంటికి కోడలయ్యేదట. కానీ ఏమైందో తెలియదు చివరి నిమిషంలో తేజారిపోయింది. ప్రస్తుతం స్వీటీ వయసు 42 ఏళ్ళు అయితే తనకు 35 ఏళ్లు ఉన్నప్పుడు ఆ స్టార్ డైరెక్టర్ తన ఇంటికి కోడలుగా రమ్మని అడిగాడట.

ragavendra-rao-anushka-shetty

అందుకు అనుష్క ఒప్పుకోలేదుట మరి స్టార్ డైరెక్టర్ మరెవరు కాదు రాఘవేందర్ రావు. యాక్టర్ మరియు డైరెక్టర్ అయిన తన కొడుకుని అనుష్కకి ఇచ్చే పెళ్లి చేద్దామనుకున్నాడట. ఇక ఈ విషయాన్ని స్వీటీకి చెప్పగా తను నో అని చెప్పిందట. ఆ తర్వాత రాఘవేందర్రావు అనిత అనే అమ్మాయికిచ్చి తన కొడుకు పెళ్లి చేశాడు. కానీ వీళ్ళిద్దరూ మూడేళ్లకే విడిపోయి విడాకులు తీసుకున్నారు. అనుష్క (Anushka Shetty) అవకాశాన్ని ఒప్పుకోవడానికి కారణం ప్రభాస్ పై ఉన్న ప్రేమే అంటూ అప్పట్లో ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి.

Ganesh Reddy