Garlic: వెల్లుల్లిని పరిగడపునే ఎందుకు తినాలో తెలుసా.?

Garlic: వెల్లుల్లిని పరిగడపునే ఎందుకు తినాలో తెలుసా.?

Garlic: ముఖ్యంగా వెల్లుల్లి లో ఉండే ఔషధ గుణాల ద్వారా జలుబు, ఫ్లూ, జ్వరం మరియు హైబీపీ రాకుండా దోహదపడుతుంది. మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును వెల్లుల్లి కరిగిస్తుంది. వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా గుండెపోటు తగ్గడమే కాకుండా ధమనులు మూసుకుపోవడం, గట్టిపడటం లాంటి పలు సమస్యలు కూడా తగ్గుతాయి. పైగా క్యాన్సర్ల వారి నుండి కూడా వెల్లుల్లి మనల్ని కాపాడుతుంది. ఇక ఇవే కాకుండా పరిగడుపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

benefits-of-eating-garlic-on-an-empty-stomach

కాలి కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల సహజ ఆంటీ బయటికి పనిచేయడమే కాక జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాలను సైతం నాశనం చేస్తుంది.  హై బీపీ సమస్య నుండి ఉపశమనం మరియు రక్తప్రసరణ మెరుగుపరిచి గుండె సమస్యలను తగ్గియడమే కాక కాలేయ, మూత్రాశయ పనితీరును కూడా అమరింత మెరుగుపరిచేలా చేస్తుంది. మన ఒత్తిడిని తగ్గించడానికి డయేరియాను అధిగమించడానికి వెల్లుల్లి చాలా చక్కటి మందులా పని చేస్తుంది. మన శరీరంలో ఉన్నటువంటి పలు విష పదార్థాలను సైతం బయటకు పంపే ఆహార పదార్థాలలో వెల్లుల్లి ఒకటి.

benefits-of-eating-garlic-on-an-empty-stomach

పొద్దున్నే వెల్లుల్లి తినడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి. జ్వరాల బారిన పడకుండా కూడా కాపాడుతుంది. ఇక ఇవే కాకుండా టీబీ, నియోమియా, జలుబు, ఊపిరితిత్తులలో కఫం చేయడం, అసమా, దగ్గు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలకు చక్కటి ఔషధంగా వెల్లుల్లి.  టీబీ సమస్యతో బాధపడేవారు నిత్యం ఒక్కటి తిన్నా చాలా ప్రయోజనం ఉంటుంది. పచ్చిది తినలేని వారు కొంచెం రంగు మారేవరకు వేడి చేసుకుని కూడా తినవచ్చు. కొందరికి వెల్లుల్లి (Garlic) పడదు అలాంటి వాళ్ళు వెల్లుల్లి తినడం మానేయడం మంచిది.

Ganesh Reddy