Watermelon Benefits: ఈ ఎండాకాలంలో ఈ పిచ్చేక్కించే పుచ్చకాయ జ్యూస్ తాగారంటే మన ఎనర్జీ తగ్గేదేలే…

Watermelon Benefits: ఈ ఎండాకాలంలో ఈ పిచ్చేక్కించే పుచ్చకాయ జ్యూస్ తాగారంటే మన ఎనర్జీ తగ్గేదేలే…

Watermelon Benefits: వేసవికాలం వచ్చిందంటే.. భగభగ మండే ఎండ నుండి ఉపశమనం పొందడానికి ఏవేవో చేస్తుంటారు. ఇక మనకి సమ్మర్ మొదలైందంటే కనబడే మొదటి ఫ్రూట్ పుచ్చకాయ. అయితే పుచ్చకాయ (Watermelon) కదా అని దానిని చాలా తక్కువ అంచనా వేయకండి. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. మన బాడీలో ఉండే హీట్ ని తగ్గించి, మనకి చలువ చేస్తుంది.

if-we-drink-this-watermelon-juice-this-summer-our-energy-will-be-super

ఈ ఎండాకాలంలో పుచ్చకాయ తింటే వేసవి తాపాన్ని మరియు మన దాహాన్ని తీర్చగలిగే అద్భుతమైన ఫలమనే చెప్పాలి. మన శరీరంలో మాటిమాటికి నీటి శాతం పడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు డిహైడ్రేషన్ తో వడదెబ్బ తగిలి కళ్ళు తిరుగుతుంటాయి. మరికొన్నిసార్లు అది ప్రాణాంతకం. అందులో భాగంగా మన బాడీలో వాటర్ లెవెల్ తగ్గకుండా పుచ్చకాయ తింటే అది మనల్ని కాపాడుతుంది.

if-we-drink-this-watermelon-juice-this-summer-our-energy-will-be-super

ఇంకా ఇదే కాక పుచ్చకాయలో ఉన్న పోషకాలు, విటమిన్లు మన శరీరానికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, సోడియం, మెగ్నీషియం, బి విటమిన్లు, క్లోరిన్, బీటా కెరోటిన్, ఆల్కలైన్ ఇలా ఎన్నో రకాలు గా మన శరీరానికి పోషకాలు అందిస్తూ ఎండాకాలం నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. మరి ముఖ్యంగా పుచ్చకాయలో (Watermelon) ఉండే వాటర్ లెవెల్స్ మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది.

Ganesh Reddy