Prabhas: డార్లింగ్ పై ప్రేమ పుకార్ల లిస్టు చాల పెద్దదే.. అనుష్కతో సహా ఎంతమంది హీరోయిన్లు అంటే..
Prabhas: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరని అడగ్గా టక్కున ప్రతి ఒక్కరు చెప్పే పేరు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ పేరు పాన్ఇండియా స్థాయిలో మార్మోగిపోతుంది. అయితే సినీ లైఫ్ మూడుపూవులు ఆరుకాయలుగా ఉన్నప్పటికీ పర్సనల్ లైఫ్ మాత్రం చాలా వెనుకపడ్డాడని చెప్పాలి. నలభై ఏళ్ల వయసు దాటిన్నప్పటికీ ఇంకా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే ప్రభాస్ పెళ్లిపై క్లారిటీ ఇవ్వకపోవడానికి కారణం ఆయనపై పుట్టిన ప్రేమ పుకార్లే.. ఎందుకంటే ఇండస్ట్రీకి చెందిన ఎందరో హీరోయిన్లతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి.
ఇక ప్రభాస్ అంటే ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ అనుష్క శెట్టి. వీళ్ళ కాంబో బాండింగ్ సూపర్ హిట్ అని చెప్పాలి బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో వీళ్ళిద్దరూ కెమిస్ట్రీ చూస్తే వీళ్ళు కచ్చితంగా ప్రేమలో ఉన్నారని భావించారు. ఇక ప్రభాస్ అనుష్క పెళ్లి అయినట్లే అని అంతా అనుకున్నారు. కానీ ఇటు ప్రభాస్ అటు అనుష్క మేమిద్దరం ఫ్రెండ్స్ అంటూ ఆ వార్తలని కొట్టిపడేశారు. ఆ తర్వాత బాలీవుడ్ బ్యూటీ కృతితో ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అయితే గతంలో ప్రభాస్ (Prabhas) త్రిష మధ్య ప్రేమాయణం కొనసాగిందని వర్షం, పౌర్ణమి చిత్రాలు చేస్తున్న సమయంలో వీళ్ళ ప్రేమ చిగురించిందని వార్తలు వినిపించగా వాటిని త్రిష కొట్టి పారేసింది. అలాగే ఇలియానా ప్రభాస్ తో మున్నా చిత్రం చేస్తున్న సమయంలో వీళ్ళిద్దరికీ రిలేషన్ ఏర్పడిందని రూమర్స్ కూడా వచ్చాయి. ఇక ఆ తర్వాత మెగాడాటర్ నిహారికతో కూడా ప్రేమ ఉన్నారని త్వరలో విరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వినిపించగా స్వయంగా నిహారిక ఆ వార్తలు పై స్పందించి అవన్నీ అవాస్తవము అంటూ కొట్టి పారేసింది.