Shivathmika: జిమ్ కి వెళ్ళేది నేను కేవలం దానికోసమే అంటున్న శివాత్మిక పోస్ట్ వైరల్..

Shivathmika: జిమ్ కి వెళ్ళేది నేను కేవలం దానికోసమే అంటున్న శివాత్మిక పోస్ట్ వైరల్..

Shivathmika: మన తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోగా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ గారి కూతురే ఈ శివాత్మిక. ఈ అమ్మడు గురించి అందరికీ తెలిసిందే.. తెలుగు చిత్ర పరిశ్రమలో దొరసాని అనే చిత్రంతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పంచతంత్రం, ఆకాశం, రంగమార్తాండ, విధి విలాసం మొదలైన చిత్రాల్లో నటించి ఎంతగానో మెప్పించిందనే చెప్పాలి. కేవలం తన నటనతో మాత్రమే కాకుండా అందంతో కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నది.

ప్రస్తుతం విలక్షణమైన కథలను ఎంపిక చేసుకుంటూ కథలకి ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటూ ఆచితూచి అడుగేస్తూ నేను చేయగలను ఇది బాగుంది అనే పాత్రలనే ఓకే చెబుతూ అడపదడపా చిత్రాలలో కనిపిస్తుంది. ఇక ఆమె సినీ జీవితాన్ని కాస్త పక్కన పెట్టి నిజ జీవితంలోకి వచ్చినట్లయితే నిత్యం శివాత్మిక (Shivathmika) సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే ఉంటుంది. సోషల్ మీడియాలో తను చేసే రచ్చ మామూలుగా ఉండదు . నెట్టింట ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం హాట్ హాట్ గా కంటెంట్ ని వడ్డిస్తూనే ఉంటుంది.

shivatmika-rajashekar

నిత్యం తన అప్డేట్లను అభిమానులతో పంచుకోవడంతో పాటుగా  హాట్ ఫోటోషూట్స్ కూడా షేర్ చేస్తూ ఎంతగానో అలరిస్తుంది. ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది . మరి ఆ పోస్ట్ ఏంటంటే.. తాను జిమ్ లో ఉన్న ఫోటోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ నేను జిమ్ కి వెళ్ళేది నేను కేవలం ఫోటోల కోసమే అంటూ క్యాప్షన్ ఇచ్చిన ఫోటోను షేర్ చేసింది. దాంతో ఈ ఫోటోను చూసిన చాలామంది రకరకాల కామెంట్లు రాయడంతో నెట్టింట ఈ   ఫోటో వైరల్ అయింది.

Ganesh Reddy