Warm Water: పరిగడపున గోరు వెచ్చని నీళ్ళు తాగడం వలన ప్రయోజనాలెన్నో..
Warm Water: ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గురించి అసలు పట్టించుకోము. పైగా మనం తింటున్న ఆహార అలవాట్లు కూడా అంత ఆరోగ్యకరమైనవి కావు తద్వారా నిత్యం అనారోగ్య సమస్యల భారిన పడుతుంటాము. అలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మన ఇంట్లోనే ఈ చిన్న చిట్కా చేయడం ఎంతో ప్రయోజనకరం. పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగండి ఆరోగ్యానికి ఎంతో మంచిది. తద్వారా మన శరీరంలో ఉండే మలినాలు బయటకి పంపబడి అధిక బరువు సమస్యని తగ్గిస్తుంది.
పరిగడుపున గోరువెచ్చని (Warm Water) నీళ్లు తాగడం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు ఊబకాయం దరిచేరవు. శరీరంలో రక్త ప్రసరణ కూడా బాగుంటుంది. మూత్ర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు మూత్రము పచ్చగా వచ్చువారు తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్లు తాగాలి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును సైతం గోరువెచ్చని నీళ్లు తాగడం ద్వారా పేరుకుపోయిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టి తాగిన చల్లని నీరు మీ దాహాన్ని తీరుస్తుంది తప్ప ఆ నీటితో ఎటువంటి ప్రయోజనం ఉండదు.
గొంతు సమస్యల బారిన పాడినప్పుడు తప్పనిసరిగా గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల గొంతులో ఉండే బ్యాక్టీరియాలను నశించిపోతాయి. తద్వారా జలుబు, దగ్గు, పడిశం, నిమోనియా వంటి వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. డిహైడ్రేషన్ తో బాధపడేవారు కూడా వేడి నీళ్లలో నిమ్మరసం, తేనె కలుపుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది. ఇక అధిక బరువు తగ్గాలనుకునే మహిళలు ప్రతి రోజు ఇలా చేస్తే బరువు నియంత్రణలో ఉంటుంది. మన ఆరోగ్యం కన్నా మనకేది ముఖ్యం చెప్పండి. మరిన్ని ఆరోగ్య చిట్కాలకై మమ్మల్ని ఫాలో అవతూ ఉండండి.